హాంగ్‌కాంగ్‌లో గొడుగులతో వేలాది మంది జనం
- August 19, 2019
హాంకాంగ్ : వేలాది మంది ప్రజాస్వామిక వాదులు హాంగ్‌కాంగ్‌లో ఆదివారం భారీ ప్రదర్శనకు తరలివెళ్లారు. భారీ వర్షం నుంచి రక్షణగా గొడుగు లు ధరించి వారు మహానగరంలోని ప్రధాన వీధి మీదుగా మహా ప్రదర్శనకు దిగారు. చైనా ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ హాంగ్‌కాంగ్‌లో ఈ వేసవిలో వారాంతపు నిరసనలు సాధారణం అయ్యాయి. తొలుత వేలాది మంది ప్రదర్శకులు స్థానిక విక్టోరియా పార్క్ లో చేరారు. ఎంతకూ ఆగని వానను లెక్కచేయకుండా ఆ తరువాత ప్రదర్శనగా సాగారు. తామంతా శాంతియు త ప్రదర్శనగా వెళ్లుతామని, తమ హక్కులసాధనకు నినదిస్తామని నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఇక్కడ ఉద్య మం సాగుతోంది, తరచూ పోలీసులతో తలపడు తూ సాగిన ప్రదర్శనలు ఈ వారాంతంలో అందు కు విరుద్ధంగా అత్యంత ప్రశాంతతో క్రమశిక్షణ తో ముందుకు సాగింది. ఘర్షణాయుత వాతావరణం ఉండబోదనే తాము భావిస్తున్నట్లు ఉద్యమ నిర్వాహకులలో ఒకరైన బోనీ లియూంగ్ తెలిపా రు. ఇక్కడి వారు శాంతిప్రియలు అనే విషయం ప్రపంచానికి తెలిసివస్తుందని చెప్పారు. వేలాది గొడుగుల నీడలో జనం అంతా కెరటాలుగా తరలివెళ్లుతూ ఉండటంతో హాంగ్‌కాంగ్‌లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. జూన్ నుంచి లియూంగ్ వర్గం వారు పౌర హక్కుల కూటమిగా ఏర్పడి ఇప్పటికీ మూడు బ్రహ్మండమైన ప్రదర్శనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







