రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్..ప్రపంచ దేశాలను సాయం అర్ధిస్తున్న అధ్యక్షుడు
- August 20, 2019
ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్‌లో ఇవాళ ఆరు చోట్ల పేలుళ్లు జరిగాయి. రెస్టారెంట్లు, పబ్లిక్ ప్రాంతాల్లో ఆ ఘటనలు చేసుకున్నాయి. ఆ పేలుళ్లలో సుమారు 66 మంది పౌరులు గాయపడ్డారు. బ్రిటీష్ పాలన నుంచి స్వాత్రంత్య్రం పొంది వందేళ్లు అయిన నేపథ్యంలో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్‌లో వేడుకలు జరుగుతున్నాయి. అయితే నాన్‌ఘర్ ప్రావిన్సులోని జలాలాబాద్ సిటీలో ఇవాళ ఆరు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు జరిగాయి. ఐ-డే ఈవెంట్లను టార్గెట్ చేస్తూ జరిగిన పేలుళ్లలో 34 మంది గాయపడినట్లు గవర్నర్ షా మొహబూద్ చెప్పారు. ఈ దాడులకు బాధ్యత ఎవరూ ప్రకటించుకోలేదు. రెండు రోజుల క్రితమే కాబూల్‌లో ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 63 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రపంచ దేశాల సాయాన్ని కోరారు. మిలిటెంట్ల ఏరివేతకు అంతర్జాతీయ దేశాలు సహకరించాలన్నారు. ఐఎస్‌కు సంబంధించిన దయిస్ను తరిమేందుకు పోరాటం చేస్తామన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..