నేడు కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. రేసులో కోటా శ్రీనివాస్, కరుణాకర్‌రెడ్డి
- August 20, 2019
కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ యడియూరప్ప కేబినెట్ కొలువు దీరే అవకాశముంది. కొత్త మంత్రివర్గంలో 18 నుంచి 20 మందిని తీసుకోనున్నారు. లింగాయత్, ఒక్కళిగ, ఎస్సీ-ఎస్టీ, కురుబ, బ్రాహ్మణ, బిల్లవ వర్గాలకు కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. లింగాయత్ వర్గానికి 5 మంత్రి పదవులు కేటాయించనున్నారు. మరో ప్రధాన వర్గం ఒక్కళిగలకు 4 కేబినెట్ పోస్టులు లభించ నున్నాయి. ఎస్సీ-ఎస్టీలకు చెరో మూడు మంత్రి పదవులు ఇచ్చే అవకాశముంది. కురుబ, బ్రాహ్మణ, బిల్లవ కులాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి ఆశావహులు పోటీపడుతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక్, జగదీశ్ శెట్టర్, వి.సోమణ్ణ, గోవింద కారజోళ, జేసీ మాధుస్వామి, బి.శ్రీరాములు, ఉమేశ్ కత్తి, డాక్టర్ అశ్వర్థనారాయణ్, శశికళా జొల్లె, రేణుకాచార్య, సీటీ రవి, బాలచంద్ర జార్కిహో ళి, శివనేగౌడనాయక్, అంగార, బోపయ్య, కోటా శ్రీనివాసపూజారి, జి.కరుణాకర్‌రెడ్డిలకు తొలివిడతలో మంత్రులుగా అవకాశం ఇస్తారని సమాచారం.
ప్రభుత్వం ఏర్పాటై 3 వారాలు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గం జాడే లేదంటూ బీజేపీపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వీటికి చెక్ పెట్టడంపై కమలదళం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి యడియూరప్ప, కేబినెట్ ఏర్పాటులో తలమునకలయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధినాయకత్వంతో చర్చించిన యడ్డీ, మరోసారి పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరపనున్నారు. మంత్రివర్గంలోకి తీసుకోబోయేవారి పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తొలి విడతలో 20 మందికి స్థానం కల్పించినా, ఇంకా 13 ఖాళీగా ఉంటాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఆ 13 స్థానాలను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







