హిమాచల్‌ప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న ప్రముఖ నటి మంజు వారియర్
- August 20, 2019
హిమాచల్‌ప్రదేశ్: మలయాళ చిత్రసీమకు చెందిన ప్రముఖ నటి మంజు వారియర్ హిమాచల్‌ప్రదేశ్ వరదల్లో చిక్కుకుంది. షూటింగ్ కోసం వెళ్లిన ఆమె చిత్ర బృందంతో కలిసి వరదల్లో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి ఫోన్ ద్వారా తెలియజేసింది. అలాగే, విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ దృష్టికి తీసుకెళ్లింది.
సినిమా చిత్రీకరణలో భాగంగా నటి మంజు సహా 30 మంది సిబ్బంది మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చత్రకు వెళ్లారు. మూడువారాలుగా వారు అక్కడే షూటింగ్ చేస్తున్నారు. వరదల కారణంగా వారు అక్కడే చిక్కుకుపోగా నటి మంజు వారియర్.. కేంద్రమంత్రి వి.మురళీధరన్‌ను సంప్రదించి సాయం కోసం అర్థించింది. ఆయన విషయాన్ని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారిని రక్షించాల్సిందిగా కోరారు. ఆ వెంటనే మండి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. వారు తక్షణం సహాయక చర్యలు చేపట్టి చిత్ర బృందాన్ని రక్షించారు. వారిని రక్షించినట్టు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







