దుబాయ్‌లో పాకిస్తానీ క్రికెటర్‌తో ఇండియన్ ఇంజనీర్ పెళ్ళి
- August 21, 2019
పాకిస్తానీ క్రికెటర్ హసన్ అలీ వివాహం ఇండియన్ ఏరోనాటికల్ ఇంజనీర్ సమియా అర్జూతో జరిగింది. దుబాయ్‌లో ఈ వివాహం జరగగా, కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. అట్లాంటిస్ - ది పామ్ వద్ద ఈ వివాహం జరిగింది. అలీ - అర్జూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అర్జూ దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఆమె ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా అర్జూ, హసన్ అలీ మధ్య ప్రేమ చిగురించింది. పెళ్ళిలో ఇండియన్ లుక్‌తో కన్పించిన అర్జూ, రిసెప్షన్లో పాకిస్తానీ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్లో వీరిద్దరి వివాహ రిసెప్షన్ జరగనుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







