అమిత్ జీ టికెట్ డబ్బులు తీసుకోలేదు: చిరు

- August 21, 2019 , by Maagulf
అమిత్ జీ టికెట్ డబ్బులు తీసుకోలేదు: చిరు

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'సైరా'. తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటించారు. నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటించారు. అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ కోసం ముంబై వెళ్లిన చిరు, బిగ్ బీ గురించి ఆసక్తికర విషయం తెలిపారు.

'అమితాబ్‌ మా వద్ద విమానం టికెట్ల డబ్బులు తీసుకోవడానికి నిరాకరించారు. మేం కూడా బలవంతం చేయలేకపోయాం. అది నిజంగా గొప్ప విషయం. అమితాబ్‌ ప్రయాణించడం కోసం ప్రైవేటు జెట్‌ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కానీ ఆయన దానికి కూడా ఒప్పుకోలేదు. ముంబయి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో బస చేయడం గురించి అడిగా. 'నేను ఇదంతా స్నేహం కోసం చేస్తున్నా' అన్నారు.

చాలా సంవత్సరాలుగా మా ఇద్దరికీ పరిచయం ఉంది. అలా అదృష్టవశాత్తు మా సినిమాలో ఆయన నటించేందుకు ఒప్పుకున్నారు. అమితాబ్‌ బచ్చన్‌కు రుణపడిపోయాను అన్నారు చిరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com