9 రూపాయలకే విమాన ప్రయాణం!

- August 21, 2019 , by Maagulf
9 రూపాయలకే విమాన ప్రయాణం!

ఢిల్లీ : బికినీ ఎయిర్ లైన్స్‌గా పేరుగాంచిన వియెట్ జెట్ మన దేశంలో విమాన సేవలు అందించేందుకు సన్నద్ధమైంది. డిసెంబర్ నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు రెడీ అవుతోంది. ఆ క్రమంలో సరికొత్త ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వియత్నాంకు చెందిన ఈ సంస్థ భారత్ నుంచి నేరుగా వియత్నాంకు విమాన సర్వీసులు నడపనుంది.

వియత్నాంకు చెందిన వియెట్ జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ డిసెంబర్ 6వ తేదీ నుంచి ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆ క్రమంలో పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా గోల్డెన్ డేస్ పేరిట బంపర్ ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరలు 9 రూపాయల నుంచి మొదలుపెట్టింది. సూపర్ సేవింగ్స్ టికెట్ పేరుతో ఈ స్కీమ్ మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆగస్టు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మాత్రమే ఆఫర్ ఇచ్చింది సదరు సంస్థ.

2011వ సంవత్సరంలో విమాన సర్వీసులు ప్రారంభించింది వియెట్‌జెట్. ఇప్పటివరకు రోజుకు 129 మార్గాల్లో దాదాపు 400 విమానాలను దిగ్విజయంగా నడుపుతోంది. అయితే 8 సంవత్సరాల తర్వాత భారత్ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఆ క్రమంలో ఇక్కడ డిసెంబర్ నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతోంది. తొలుత ఢిల్లీ నుంచి వియత్నాంలోని హో చి మిన్‌ వరకు రెండు విమానాలు నడపాలని డిసైడ్ అయింది. 9 రూపాయల అతి తక్కువ ధరలో మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించిన వియెట్‌జెట్ విమాన టికెట్ కావాలనుకుంటే www.vietjet.com నుంచి బుక్ చేసుకునే సౌకర్యముంది.

ఇదివరకు వివాదస్పద నిర్ణయంతో వియెట్‌జెట్ ఆరోపణలు ఎదుర్కొంది. ఎయిర్‌హోస్టెస్ డ్రెస్సింగ్ విషయంలో హుందాతనం కనబరచకపోగా.. వారికి బికినీలు వేయించి ప్రయాణీకులకు ఆతిథ్యం ఇప్పించింది. ఈ విషయంలో అప్పట్లో చాలా వివాదాలు ఎదుర్కొంది ఈ సంస్థ. వియత్నాం పౌర విమానయాన ప్రాధికార సంస్థ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక భారీ జరిమానా విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com