చిదంబరం అరెస్ట్...

- August 21, 2019 , by Maagulf
చిదంబరం అరెస్ట్...

ఢిల్లీ:కేంద్రమాజీ మంత్రి పీ.చిదంబరం అరెస్ట్ అయ్యాడు. పార్టీ కార్యాలయం నుండి నేరుగా ఇంటికి చేరుకున్న చిదంబరం ను సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుంది...కాగా అంతకుముందు చిదంబరం ఇంటి ముందు హైడ్రామా నెలకోంది. సిబిఐ, ఈడీ అధికారులు, ఆయన ఇంటికి చేరుకున్నారు. చిదంబరం ఇంటికి వెళ్లిన అధికారులను సిబ్బంది లోపలికి అనుమతించలేదు...వారు గోడదూకి మరి ఇంట్లోకి వెళ్లారు. అయితే చాల సేపటివరకు చిదంబరం ఇంట్లోకి వెళ్లలేక పోయారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదన్నట్టుగా సిబిఐ అధికారులు వ్యవహరించారు....అయితే సీబీఐతో పాటు చిదంబరం ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు మాత్రం వెనక్కి మళ్లారు..కాని సిబిఐ మాత్రం ఇంకా ఇంటి అవరణలోనే వేచి ఉండి ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత గత 24 గంటలుగా కనిపించకుండా పోయిన చిదంబరం అకస్మాత్తుగా ఏఐసీసీ కార్యాలయాంలో ప్రత్యక్షమయ్యారు. అప్పటికే సీబీఐ,ఈడీ అధికారులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే పార్టీ కార్యకర్తలు దర్యాప్తు అధికారులను అనుమతించకపోవడంతో కార్యాలయంలోపలకి వెళ్లలేక పోయారు. ఇక చిదంబరం మీడీయా సమావేశం ముగిసిన తర్వాత నేరుగా తన ఇంటికి చేరుకున్నారు.

కాగా అంతకుముందు ఏఐసీసీ కార్యాయంలో మాట్లాడిన చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, చార్జీషీట్‌లో తనపేరు లేదని పేర్కొన్నారు. ముడుపులకు సంబంధించి ఆరోపణలు లేవని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలో తనను ఇరికించడం ఏంటీ అని ప్రశ్నించారు. ఈ కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై నిన్నటి నుంచి తన లాయర్లతో సంప్రదింపులు జరిపానని పేర్కొన్నారు. తానేం తప్పుచేయలేదని .. ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. ఓ పౌరుడిగా తిరిగే అధికారం తనకు ఉందని వివరించారు. చట్టాన్ని గౌరవిస్తానని .. దర్యాప్తు సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com