ఘనంగా శిల్పకళా వేదికలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు
- August 21, 2019
హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానుల కోసం ప్రత్యేకించి డ్యాన్సులు, పాటల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ అండ్ గాయనీగాయకుల టీమ్ చిరు క్లాసిక్ మెడ్లీ పాటలతో మైమరిపించారు. జబర్దస్త్ టీమ్ సరదా పార్టిసిపేషన్ ఆకట్టుకుంది. ముఠా మేస్త్రి ల్యాండ్ మార్క్ స్టెప్పులతో జబర్దస్త్ కమెడియన్లు ఆకట్టుకున్నారు. సత్య మాస్టర్ మెడ్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ మైమరిపించింది. నిర్మాత కం ఎగ్జిబిటర్ ప్రతాని రామకృష్ణ గౌడ్.. 10వ తరగతిలో మంచి మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్,మెగా స్టార్ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..