నిత్యా మీనన్‌ ఫిజిక్ పై కామెంట్లు...పెదవిప్పిన నటి

- August 22, 2019 , by Maagulf
నిత్యా మీనన్‌ ఫిజిక్ పై కామెంట్లు...పెదవిప్పిన నటి

నిత్యా మీనన్‌ మంచి నటిగా అందరికీ తెలుసు. ఎంపిక చేసుకున్న పాత్రల్లో మాత్రమే నటిస్తుంది. అందుకే ఎక్కువ చిత్రాల్లో ఆమె కనిపించదు. కెరీర్‌పై స్పష్టమైన అవగాహన, ఆలోచన ఉన్న నిత్య ఇటీవల హిందీ చిత్రం మిషన్‌ మంగళ్ లో నటించింది. మరో వైపు ఆమె శరీరాకృతిపై అనేక కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. టీవీ యాడ్స్‌లో సైతం నిత్యామీనన్‌ లావెక్కినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఆమె స్పందించింది. లావుగా కనిపించే వారి గురించి కొందరు చులకనగా మాట్లాడుతుంటారు. ఇది సరికాదు. తిని కూర్చోవడం వల్ల ఇలా అయ్యారనేది వారి అభిప్రాయం. ఆర్టిస్టుల విషయానికి వస్తే వారు తమ శరీరంపై ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తుంటారు. అయినప్పటికీ లావుకావడం హార్మోన్ల ప్రభావం వల్ల కావచ్చు. ఇది గ్రహించాల్సిందిగా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్న వారికి గుర్తిచేస్తున్నాను అని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com