రేపు హైదరాబాద్ రానున్న పీవీ సింధు
- August 26, 2019
హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ తార పీవీ సింధు మంగళవారం హైదరాబాద్‌కు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె నగరానికి చేరుకుంటుందని సమాచారం. ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్విట్జర్లాండ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. సింధు రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రెండేళ్ల క్రితం తనకు స్వర్ణం దూరం చేసిన జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరను సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో చిత్తుగా ఓడించింది. దూకుడుగా ఆడింది. తన పదునైన స్మాష్లతో విరుచుకుపడింది. ఛాంపియన్‌షిప్‌లో సింధు ఇంతకు ముందు 2 కాంస్యాలు, 2 రజతాలు గెలుచుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. భారత బ్యాడ్మింటన్ సంఘం రూ.5 లక్షల బహుమానంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







