సౌదీ అరేబియా లో ఒకేసారి 23 మందికి మరణశిక్ష..
- August 26, 2019
సౌదీ అరేబియా:డ్రగ్స్ సంబంధిత నేరాలలో జైలుశిక్షను అనుభవిస్తున్న 23 మంది నైజీరియన్లను ఏ క్షణానైనా సౌదీలో ఉరితీసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.సౌదీ అరేబియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. సౌదీ అరేబియా చట్టాల ప్రకారం డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసినా..ఇతర కార్యకలాపాలకు పూనుకున్నా కఠిన శిక్షలు విధిస్తారు.2016 నుంచి 2017 మధ్యలో కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జెడ్డా అండ్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ అబ్దు అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తదితర ప్రదేశాలలో డ్రగ్స్ సంబంధిత నేరాలలో చాలా మంది అరెస్ట్ అయ్యారు. జెడ్డాలో 1,183 గ్రాముల కొకైన్‌తో పట్టుబడిన కుదిరత్ అఫోలబీ, సహాద్ సోబేడ్ అనే ఇద్దరు నైజీరియన్లకు ఇప్పటికే ఉరిశిక్షను విధించినట్టు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ఇప్పుడు మరో 23 మంది నైజీరియన్లకు ఏ క్షణానైనా శిరచ్చేధం లేదా ఉరిశిక్ష విధించే అవకాశమున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







