వెదర్‌ అలర్ట్‌: యూఏఈలో పలు చోట్ల పొగమంచు

- August 27, 2019 , by Maagulf
వెదర్‌ అలర్ట్‌: యూఏఈలో పలు చోట్ల పొగమంచు

యూఏఈలోని పలు చోట్ల ఉదయం పొగమంచు అలముకుంది. దాంతో విజిబిలిటీ 1,000 మీటర్లకంటే తక్కువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిటియరాలజీ వాహనదారులకు స్పష్టమైన సూచనలు చేసింది. రోడ్డుపై వాహనదారులు అప్రమత్తంగా వుండాలని ఈ సూచనల్లో పేర్కొంది ఎన్‌సిఎం. మరోపక్క ఆకాశం పాక్షికంగా మేఘావృతమయ్యే అవకాశాలున్నాయనీ, హ్యుమిడిటీ పెరిగే అవకాశం వుందని తెలిపింది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ. గాలుల తీవ్రత ఓ మోస్తరుగా వుంటుందనీ, సముద్రం సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్‌గా మారే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com