హీరో శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం...
- August 28, 2019
శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీకార్తీక్ దర్శకత్వంలో కొత్త చిత్రం బుధవారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్ కూడా బుధవారం నుండే ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. నాజర్, వెన్నెలకిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడదీయలేని స్నేహం, ప్రేమ అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెకకనుంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







