వేధింపుల కేసులో కువైటీ అరెస్ట్
- August 30, 2019
కువైట్ సిటీ: పోలీసులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓ మహిళను, ఆమె కుమార్తెను నిందితుడు వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు తన కుమారుడిపై నిందితుడు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు తనను తన కుమార్తెను ఫాలో అవుతూ వస్తున్నాడనీ, తమను వేధిస్తున్నాడనీ, ఈ క్రమంలో తన కుమారుడు నిందితుడ్ని నిలదీసేసరికి, హఠాత్తుగా దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. గాయపడ్డ తన కుమారుడ్ని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయించామని పోలీసులకు అందించిన ఫిర్యాదులో వివరించారు బాధితురాలు. కేవలం గంట వ్యవధిలోనే పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.
షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







