‘ఐరా’కి మీ ఆశీర్వాదం కావాలి:హీరో విష్ణు
- August 30, 2019
హైదరాబాద్:హీరో విష్ణు రీసెంట్‌గా జన్మించిన తన కూతురు ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఆ చిన్నారి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పాపకి ఐరా విద్య అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఐరాకి మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలని కోరారు. నటుడిగా పేరు తెచ్చుకున్న విష్ణు 2009 మార్చిలో విరానికని ప్రేమ వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 2011లో వీరికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. వారికి అరియానా, వివియానా అని పేరు పెట్టారు. 2018లో వారు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బేబీ బాయ్‌కి అవ్రామ్ భక్త అని పేరు పెట్టారు. తాజాగా వారికి మరో ఆడబిడ్డ పుట్టింది.
అయితే ఇటీవల జన్మించిన తన నాలుగో బిడ్డ డెలివరీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెడతానని విష్ణు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా చేయమని కాజల్ అగర్వాల్ తనకి సలహా ఇచ్చిందని విష్ణు ట్వీట్ లో తెలిపాడు. దీనికి విరానికా.. విష్ణుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మిమ్మల్ని ఇద్దరిని మామూలుగా కొట్టనంటూ రీట్వీట్ చేసింది. విరానికా కౌంటర్‌కు స్పందించిన విష్ణు కొన్ని బెదిరింపుల వలన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాలనే ఆలోచన విరమించుకున్నాను. ఆమెకి మోహన్ బాబు సపోర్ట్ ఉంది. దీంతో నిర్ణయం మార్చుకోక తప్పలేదు అంటూ సరదాగా స్పందించాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..