స్కూల్‌ ఫస్ట్‌ డే: వర్కింగ్‌ అవర్స్‌ని తగ్గించిన యూఏఈ కంపెనీ

- August 31, 2019 , by Maagulf
స్కూల్‌ ఫస్ట్‌ డే: వర్కింగ్‌ అవర్స్‌ని తగ్గించిన యూఏఈ కంపెనీ

షార్జా బ్రాడ్‌ కాస్టింగ్‌ అథారిటీ, తమ ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులకు సెప్టెంబర్‌ 1న వర్కింగ్‌ అవర్స్‌ తగ్గించింది. ఉద్యోగులు తమ చిన్నారుల్ని స్కూల్‌కి పంపించడం, అలాగే ఇంటికి తీసుకురావడానికి సంబంధించి వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది సదరు కార్యాలయం. అయితే, ఉదయం 9.30 నిమిషాలలోపు కార్యాలయానికి ఉద్యోగులు చేరుకోవాల్సి వుంటుంది. కాగా, పెడరల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులు, తమ చిన్నారుల స్కూల్‌ నిమిత్తం వారం రోజులపాటు మూడు గంటల సమయాన్ని వెసులుబాటుగా పొందనున్న విషయం విదితమే. ఈ మేరకు ఫెడరల్‌అథారిటీ ఫర్‌ గవర్నమెంట్‌ అండ్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com