ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. నెలకు రూ.1500లు కడితే.
- September 06, 2019
బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరో కొత్త పాలసీని లాంచ్ చేసింది. అదే ఎల్‌ఐసీ టెక్ టర్మ్ ప్లాన్. ఇది ఆన్‌లైన్ టెర్మ్ పాలసీ. ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.50 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. పాలసీ దారుడికి కచ్చితంగా రెగ్యులర్ ఆదాయం వచ్చే మార్గం ఉండాలి. ఏడాదికి ఒకసారైనా అంటే వార్షిక ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే 3 నెలలకోసారి, 6 నెలలకోసారి కూడా చెల్లించొచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు.. గరిష్టంగా 40 ఏళ్ల వరకు వర్తిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 80 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ లభిస్తుంది.
పాలసీతో పాటు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా తీసుకోవచ్చు. అయితే దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం మాత్రం పొగతాగే వారికి ఒక విధంగా, తాగని వారికి ఒక విధంగా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అమెక్స్ కార్డు, యూపీఐ, ఐఎంపీఎస్, ఇ-వాలెట్స్ వీటిల్లో ఏదో ఒక దాని ద్వారా ప్రీమియం చెల్లించొచ్చు. పాలసీని ఆన్‌లైన్‌లో మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇంటి అడ్రస్‌కు వస్తాయి. ఎలాంటి మెడికల్ టెస్టులు అవసరం లేకుండానే పాలసీ తీసుకోవచ్చు. ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పాలసీకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని పాలసీ తీసుకుంటే మంచిది.మరిన్ని వివరాలకు ఈ మొబైల్ నెంబర్ 00919949322175 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష