ఈ తాత చేసినపని ఏంటో చూడండి..
- September 10, 2019
న్యూఢిల్లీ: వేషం మార్చి నకిలీ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు చెక్కేద్దామనుకున్న వ్యక్తికి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా అధికారులు చెక్ పెట్టారు. సినీ ఫక్కీలో జయేశ్ పటేల్ (32) 81 ఏళ్ల వృద్ధుడిలా వేషం మార్చుకున్నాడు. గడ్డం, కళ్ల జోడు, నెత్తికి, గడ్డానికి తెల్ల రంగు, వీల్ చైర్ ఇలా అన్ని హంగులతో సీనియర్ సిటిజన్‌లా దర్జాగా న్యూయార్క్‌కు పయనమయ్యాడు. కానీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అతగాడి వాలకాన్ని, ప్రవర్తనను పసిగట్టేయడంతో అడ్డంగా బుక్కయ్యాడు.
వివరాల్లోకి వెళితే..గుజరాత్‌లోని అహ‍్మదాబాద్‌కు చెందిన జయేశ్ పటేల్ తనను తాను 81 ఏళ్ల అమ్రిక్ సింగ్‌గా మార్చుకున్నాడు. అతని పేరుతో నకిలీ పాస్‌పోర్ట్ సృష్టించాడు. తెల్లని జుట్టు, గడ్డంతో వీల్ చైర్ మీద న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాడు. అయితే అతని శారీరక రూపానికి, ప్రవర్తనకు సరిపోలకపోవడంతో సిఐఎస్‌ఎఫ్ ఎస్‌ఐ రాజ్‌వీర్ సింగ్ అతగాడిని ప్రశ్నించాడు. నిందితుడు అధికారి కళ్లలోకి సూటిగా చూడకుండా.. బిత్తిరి చూపులు చూడటం మొదలు పెట్టాడు. దీంతో మరింత లోతుగా పరిశీలించగా అసలు గుట్టు రట్టయింది. తదుపరి దర్యాప్తు కోసం జయేష్ పటేల్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగించామనీ, ఈ చట్టవిరుద్ధమైన చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై దర్యాప్తు జరుగుతోందని సీనియర్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!







