రెక్లెస్‌ డ్రైవింగ్‌: ట్రక్‌ డ్రైవర్‌ అరెస్ట్‌, కొనసాగుతున్న విచారణ!

- September 10, 2019 , by Maagulf
రెక్లెస్‌ డ్రైవింగ్‌: ట్రక్‌ డ్రైవర్‌ అరెస్ట్‌, కొనసాగుతున్న విచారణ!

బహ్రెయిన్: కింగ్‌డమ్‌లోని ఓ ప్రముఖ హైవే మీద అత్యంత వేగంగా, అత్యంత ప్రమాదకరంగా వాహనాన్ని నడిపిన ఓ ట్రక్‌ డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన ఓ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. అత్యంత వేగంగా ట్రక్‌ వెళుతున్న విషయాన్ని తన కెమెరాలో ఓ వాహనదారుడు చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సంబంధిత అథారిటీస్‌కి సైతం సదరు వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో, రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్‌ చేసి, ఆ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఈ ఘటనపై విచారణ ప్రారంభించిందని, ట్రక్‌ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నామనీ ట్రాఫిక్‌ ప్రాసిక్యూషన్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ హుస్సేన్‌ అల్‌ సైరాఫి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com