మిరాకిల్‌ గార్డెన్‌ విజిటర్స్‌ కోసం కొత్త బస్సులు

- January 08, 2016 , by Maagulf
మిరాకిల్‌ గార్డెన్‌ విజిటర్స్‌ కోసం కొత్త బస్సులు


రోడ్స్‌ మరియు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌కి ఊతమివ్వడంలో భాగంగా కొత్త బస్సు సర్వీసులను రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోంది. ఆర్‌టీఏ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ అదెల్‌ మహమ్మద్‌ షక్రి మాట్లాడుతూ, 105 నెంబర్‌ పేరుతో కొత్త బస్‌ రూట్‌ని ఏర్పాటు చేశామన్నారు. షేక్‌ జాయెద్‌ రోడ్‌లోని ఎమిరేట్స్‌ స్టేషన్‌ మాల్‌ నుంచి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్‌లోగల మిరాకిల్‌ గార్డెన్‌ వరకు ఈ కొత్త సర్వీసు పార్క్‌ సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. మార్గమధ్యంలో ఎక్కడా ఈ బస్‌ ఆగకుండా సర్వీసును ఏర్పాటు చేశారు. సాధారణ సర్వీసులకు భిన్నంగా ఈ కొత్త సర్వీస్‌ ప్రయాణీకుల ఆదరణ పొందుతుందని ఆర్‌టిఎ వర్గాలు వెల్లడించాయి. ఆది వారం నుంచి గురువారం వరకూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్ర, శని వారాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రారంభించినప్పటి నుంచి 14000 మందికి ఈ సర్వీసు సేవలందించిందనీ, 5 దిర్హామ్‌లు ఛార్జిగా నిర్ణయించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com