పఠాన్‌కోట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ..

- January 09, 2016 , by Maagulf
పఠాన్‌కోట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ..

ప్రధాని నరేంద్ర మోడీ పఠాన్‌కోట్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. ఉగ్రవాదుల దాడుల్లో గాయపడిన జవాన్లను మోడీ పరామర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పఠాన్‌కోట్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా మోడీ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి భద్రతా దళాలు భద్రత కట్టుదిట్టం చేశారు. అనంతరం ఆర్మీ అధికారులతో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆరుగురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com