చిరంజీవి కార్యాలయం వద్ద సైరా వంశీయులు ధర్నా
- September 14, 2019
తమకు న్యాయం చేయాలంటూ ఉయ్యాలవాడ వంశీ యులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.సైరా నరసింహారెడ్డి సినిమా తీసేందుకు కావలసిన పూర్తి సమాచారంతో పాటు ,సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్ లతో పాటు, నరసింహారెడ్డి జీవిత చరిత్రను పూర్తిగా తమనుండి తెలుసుకొన్నారని అన్నారు. సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైరా వంశీయులు ధర్నా చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







