ఫాల్కన్‌, హంటింగ్‌ కాంపిటీషన్స్‌

- January 09, 2016 , by Maagulf
ఫాల్కన్‌, హంటింగ్‌ కాంపిటీషన్స్‌

బహ్రెయిన్‌ తీఇంటర్నేషనల్‌ ఎండ్యురెన్స్‌ విలేజ్‌లో నాజర్‌ బిన్‌ హమాద్‌ ఫౌండేషన్‌ సహాయంతో బహ్రెయిన్‌ టోర్నమెంట్‌ ఆఫ్‌ ఫాల్కన్‌ అండ్‌ హంటింగ్‌ డాగ్స్‌ (ఫిమేల్‌) విజయవంతంగా జరుగుతోంది. పాల్గొన్న 14 పార్టిసిపెంట్లలో 12 రేస్‌ని కంప్లీట్‌ చేశాయి. బహ్రెయిన్‌ రాయల్‌ ఇక్వెస్ట్రియన్‌ ఎండ్యురాన్స్‌ ఫౌండేషన్‌ రపెసిడెంట్‌ మరియు రాయల్‌ కుటుంబ సభ్యులు పలువురు ఈ రేస్‌ని తిలకించారు. బహ్రెయిన్‌ ఒలింపిక్‌ కమిటీ ప్రెసిడెంట్‌ షేక్‌ నాజర్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా తదితరులు హాజరయ్యారు. 13వ నెంబర్‌ ట్యాగ్‌ గల డాగ్‌ తొలి స్థానం దక్కించుకుంది. షేక్‌ ఖాలిద్‌ బిన్‌ అలీ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా ఆ డాగ్‌కి సొంతదారు. హమాద్‌ ఖాలిద్‌ అల్‌ రుమైహి, షేక్‌ నూన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, మహమ్మద్‌ యూసిఫ్‌ అల్‌ తనీబ్‌లకు చెందిన డాగ్స్‌ మిగతా స్థానాల్లో నిలిచాయి. సాలుకి హంటింగ్‌ డాగ్స్‌ (మేల్‌), షూటింగ్‌ కాంటెస్ట్‌, ట్రెడిషనల్‌ రేస్‌ ఫర్‌ అరేబియన్‌ హార్సెస్‌ వంటి పోటీలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com