ప్రభాస్ రిలీజ్ చేసిన “మన్ బైరాగి” ఫస్ట్ లుక్
- September 17, 2019
హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, బ్లాక్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగాసంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో మన్ బైరాగి మూవీ ని మహావీర్ జైన్ తో కలసి నిర్మిస్తున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు మోదీ బర్త్ డే సందర్భంగా ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
నిర్మాత సంజయ్ మాట్లాడుతూ … ఈ మూవీ స్టోరీ చాలా రీసెర్చ్ చేసి రూపొందించబడిందని, ప్రధాని మోదీ జీవితానికి సంబంధించిన ఎవరికీ తెలియని విషయాలను ఈ మూవీ లో చూపిస్తున్నామని, మోదీ యువకుడిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటన ఈచిత్రం ద్వారా తెలియనుందని, ఈ చిత్ర కథ తన మనసును ఆకట్టుకొందని, అందుకే ఈ మూవీ ని తానే నిర్మిస్తున్నట్టు చెప్పారు. మరో నిర్మాత మహావీర్ జైన్ మాట్లాడుతూ .. మన్ బైరాగి మూవీ కథ యువతకు ప్రేరణ నిస్తుందని చెప్పారు. దర్శకుడు సంజయ్ త్రిపాఠి మాట్లాడుతూ .. ఒక సాధారణ యువకుడు స్ట్రాంగ్ లీడర్ గా ఎదిగి, ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న మన్ బైరాగి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం