అగ్ని ప్రమాదం: ఏడుగుర్ని రక్షించిన అధికారులు

అగ్ని ప్రమాదం: ఏడుగుర్ని రక్షించిన అధికారులు

కువైట్‌: మసాయెల్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి ఏడుగుర్ని సురక్షితంగా అధికారులు బయటకు తీసుకొచ్చారు. కువైట్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ - పబ్లిక్‌ రిలేషన్స్‌ అండ్‌ మీడియా డిపార్ట్‌మెంట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు ఫైర్‌ ఫైటింగ్‌ టీమ్స్‌, సంఘటన గురించి తెలిసిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు. పరిస్థితిని అత్యంత వేగంగా అంచనా వేసి, మంటల్లో చిక్కుకున్న ఏడుగుర్ని ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు తీసుకొచ్చారు. ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు పేర్కొన్నారు.

Back to Top