తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కసరత్తు..
- January 09, 2016
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తోంది. తెలంగాణలో 82 లక్షల వాహనాలు .... తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల వాహనాలున్నాయి. ఇందులో ఎక్కువ ప్రమాదాలు ద్విచక్రవాహనాలు, లారీల వల్లే జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, మితిమీరిన స్పీడ్, నిర్లక్ష్యంగా నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి 8 వేల మంది మరణిస్తున్నారు.30 వేల మంది గాయాలపాలవుతుండగా.. 20 వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో అనేకమంది రోడ్డునపడుతున్నారు. రోడ్డు నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు .... ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోబోతుంది. కార్లు, ఇతర వాహనదారులు సీట్ బెల్టులు ధరించేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకోసం మొదట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో కార్లకు నల్లటి అద్దాలు తొలగించిన తీరుగానే నెలవారీగా ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించనున్నారు. హైవేలపై ఉన్న మద్యం దుకాణాలపై దృష్టి ....... మరోవైపు హైవేలపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు.. హైవేలపై మద్యం దుకాణాల నిర్వహణపై కూడా దృష్టి సారించనున్నారు అధికారులు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు జరపకుండా కఠిన వైఖరి అవలంబించాలని భావిస్తున్నారు. ఇక నగరాల్లో నిర్వహిస్తున్న విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రమాదాల నివారణ కోసం పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్, రవాణా, విద్యాశాఖ, కమర్షియల్ టాక్స్ వంటి శాఖలను సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ప్రమాదాల నివారణ కోసం ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు రవాణాశాఖ అధికారులు పర్యటన చేయనున్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







