బ్రిస్బేన్‌ అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీలో సానియా జోడి గెలుపు

- January 09, 2016 , by Maagulf
బ్రిస్బేన్‌ అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీలో సానియా జోడి గెలుపు

హైదరాబాద్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌, తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌ సానియా మీర్జా నూతన సంవత్సరాన్ని గెలుపుతో ప్రారంభించింది. బ్రిస్బేన్‌ అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీలో మార్టినా హింగిస్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా ఈ ఏడాది తొలి మహిళల డబుల్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకుంది. క్వీన్స్‌ టెన్నిస్‌ సెంటర్‌లో శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో సానియా, హింగిస్‌ జంట 75, 61తో విక్టోరియా అజరెంకా, ఆండ్రియా పెట్కోవిచ్‌ ద్వయాన్ని చిత్తు చేసింది.ఇండోస్విజ్‌ జంటకు ఈ గెలుపు వరుసగా 26వది. ఈ ఏడాది ఇది తొలి టైటిల్‌. ఈ టైటిల్‌తో కలిపితే సానియా, హింగిస్‌ జంట వరుసగా ఆరు టైటిళ్లు గెలిచింది.మహిళల విభాగంలో గిగి ఫెర్నాండెజ్‌, నటాష జ్వెరెవ తర్వాత సుదీర్ఘమైన విజయ పరంపర ఇదే. 1994 సీజన్‌లో గిగి, నటాష జంట వరుసగా 28 మ్యాచ్‌లు గెలిచింది. అంతేకాకుండా 29 ఏళ్ల సానియా ఈ టైటిల్‌ గెలవడం ఇది రెండోసారి. అమెరికా భాగస్వామి బేథనీ మటెక్‌ సాండ్స్‌తో కలిసి 2013లో విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో మార్టినా హింగిస్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగింది. ప్రపంచ టాప్‌ ర్యాంక్‌ జోడీ తొలి సెట్‌ రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 20 ఆధిక్యంతో నిలిచింది. కానీ వైల్డ్‌ కార్డ్‌ జంట తీవ్రంగా ప్రతిఘటించి సానియా, మార్టినా సర్వీస్‌లను రెండుసార్లు బ్రేక్‌ చేసి 42 ఆధిక్యం సంపాదించింది. ఇరు జోడీలు తమ తమ సర్వీస్‌లను నిలుపు కోవడంలో విఫలం కావడంతో తొలి సెట్‌లో హోరాహోరీ పోరు కొనసాగింది.అయితే సానియా జంట తొలుత స్కోరును 44తో సమం చేసింది. తర్వాత 54తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ప్రత్యర్థి జోడీ 56 స్కోరును సాధించడంతో తొలి సెట్‌ టై బ్రేక్‌కు దారితీసింది. కానీ టై బ్రేక్‌లో సానియా జోడీతే పైచేయిగా నిలిచింది. తొలి సెట్‌లో నెమ్మదిగా ఆడిన సానియా, మార్టినా జోడీ రెండో సెట్‌లో స్పీడును పెంచింది. ఒకేసారి 50 ఆధిక్యంతో నిలిచింది. ప్రత్యర్థి జోడీ ఎలాగోలా ఆరో గేమ్‌ను గెలిచింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. తర్వాతి సర్వీస్‌ను నిలబెట్టుకున్న సానియా జోడీ రెండో సెట్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com