పాత ట్రాఫిక్ జరిమానాలకు 50 శాతం రాయితి
- January 09, 2016
గత ఏడాది బకాయి పడిన పాత ట్రాఫిక్ జరిమానాలకు 50 శాతం రాయితీను వాహనదారులు ఇకపై చెల్లిస్తే సరిపోతుందని ట్రాఫిక్ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అవకాశం ఈ ఏడాది ఏప్రిల్ 7 వ తేది లోపు మాత్రమె వర్తిస్తుందని , గత ఏడాది డిసెంబర్ 31 వ తేది లోపున జరిమానాలు విధించబడిన వాహనదారులకి మాత్రమె వర్తిస్తుందని డైరెక్టర్ జనరల్ అఫ్ ట్రాఫిక్ తెలిపారు. 3 నెలల గడువులోపు ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాదర్ వ్యవస్థ ద్వారా నమోదు కాబడిన అన్ని ట్రాఫిక్ అన్ని నిబంధనలు ఈ పరిధి లోనికి వస్తాయని తెలిపారు. బకాయి పడిన పాత ట్రాఫిక్ జరిమానాలను వాహనదారులు ' మొఇ ఈ- చానల్స్ , మొఇ వెబ్ పోర్టల్ , మెత్రాష్ తో మొబైల్ యాప్స్ స్వయం సేవా కిఒస్కస్, అలాగే, అన్ని ట్రాఫిక్ విభాగ కౌంటర్ల ద్వారా చెల్లించవచ్చు. త్వరలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులో రానున్న నేపధ్యంలో పాత ట్రాఫిక్ జరిమానాలను త్వరితగతిన ముగించేందుకు 50 శాతం రాయతిని ట్రాఫిక్ విభాగం ప్రకటించింది. ప్రజలందరు రానున్న నూతన ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా పలు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, విలువైన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ విభాగంతో సహకరించాలని డైరెక్టర్ జనరల్ అఫ్ ట్రాఫిక్ తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







