ఈ సారి సొంత ఫార్మ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు--చిరు
- January 10, 2016
మెగా ఫ్యామిలీ ఈసారి సంక్రాంతిని చాలా డిఫరెంట్ గా సెలెబ్రేట్ చేసుకోవడానికి భారీ ప్రణాలికలు రచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి సంక్రాంతి పండుగను హైదరాబాద్ లో కాకుండా కాస్తంత డిఫరెంటుగా బెంగళూరు ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకోవాలిని చిరంజీవి భారీ ప్రణాలికలు రచించినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగుళూరు సిటీకి అత్యంత సమీపంలో ఉన్న చిరంజీవి ఫార్మ్ హౌస్ ఈ సంక్రాంతి వేడుకలకు కేంద్రం కాబోతోంది అంటూ మెగా కాంపౌండ్ కధనం. ఈ ఫార్మ్ హౌస్ లో ఈసారి కొద్దిగా అట్టహాసంగా ఈ సంక్రాంతి వేడుకలను రామ్ చరణ్ స్వయంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మెగా హీరోలంతా షూటింగులకు సెలవులు పెట్టి మరీ రెడీ అయిపోతున్నారు అని టాక్.ఎవరు ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా ఫ్యామిలీ సమేతంగా ఓచోట కలుసుకుని ఉత్సవం జరుపుకోవడం మెగాకుటుంబానికి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. ఈసారి ఇలా సంక్రాంతి హంగామాకు కలవబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, నాగబాబు కుటుంబం, సాయిధరమ్ ఫ్యామిలీ అందరూ ఫామ్ హౌస్ లో కలుసుకుని సంబరాల్ని కన్నులపండువగా చేసుకోబోతున్నారట. అందుకోసమే చిరంజీవి 150వ సినిమాని వాయిదా వేశారు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా బన్ని, అల్లు శిరీష్ లు కూడా మెగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మెగా కుటుబంలో హీరోల సంఖ్య పెరిగిపోయి ఆ కుటుంబసభ్యుల మధ్య పోటీ ఏర్పడటంతో వారి మధ్య దూరాలు పెరిగాయి అన్న వార్తలు ఉన్నాయి. ఆ వార్తలకు చెక్ పెట్టి తిరిగి మెగా ఫ్యామిలీ పై తన పట్టును నిలుపు కోవడాని చిరంజీవి ఈప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలి. ఇంతకీ ఈ సంబరాలకు పవన్ వస్తాడా అన్నదే సమాధానం లేని ప్రశ్న..
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







