తల్లిని వెతుక్కుంటూ..
- January 10, 2016
పాతికేళ్ల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తల్లి కోసం ఇద్దరు కుమార్తెలు వెతుకులాట ప్రారంభించారు. తల్లి ఫోటో పట్టుకుని నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతోపాటు సోషల్ మీడియాలోనూ వెతుకుతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పాతబస్తీకి చెందిన రజియా సాహెబ్ దుబాయ్‌కు చెందిన రషీద్ ఈద్ ఉబేద్ను వివాహం చేసుకుంది. భర్తతో దుబాయ్‌కు వెళ్లింది. ఆమెకు ఆయేషా, ఫాతిమా అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. పిల్లలకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు భర్తతో వచ్చిన విబేధాల కారణంగా విడాకులు తీసుకుని 1988లో హైదరాబాద్‌కు ఆమె వచ్చేశారు. దీంతో రషీద్ మరో పెళ్లి చేసుకున్నారు. మొదటి నుంచి రెండో ఆమెనే ఆయేషా, ఫాతిమా తల్లిగా భావించారు. అయితే కొద్ది రోజుల క్రితం తండ్రి మరణంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో తల్లిని వెతుక్కుంటూ ఆమె ఫోటో పట్టుకుని హైదరాబాద్ బాట పట్టారు. ఇద్దరు యువతుల ఫిర్యాదు మేరకు సౌత్ జోన్ పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. వెతుకులాట ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







