గర్ల్‌ఫ్రెండ్ కోసం భార్య దగ్గర 10,000 బహ్రెయినీ దినార్స్ దొంగిలించిన భర్త
- September 26, 2019
బహ్రెయినీ మహిళ ఒకరు తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బ్యాంక్ అకౌంట్ నుంచి 10,000 దినార్స్ దొంగిలించిన తన భర్త, అతని గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి షికారు వెళ్ళినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. తన సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి, తన భర్త ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు బాధితురాలు. ఖామిస్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను మోసం చేసిన భర్త నుంచి విడాకులు కోరుతున్నారు బాధితురాలు. కేసుని ఫ్యామిలీ మరియు చైల్డ్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. అయితే, బాధితురాలికి సగం డబ్బు చెల్లించేందుకు ఒప్పుకున్న నిందితుడు, మిగతా మొత్తాన్ని త్వరలో ఇచ్చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మిగతా మొత్తం చెల్లించకుండా, విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు బాధితురాలు మరో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







