విదేశాల్లో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
- September 28, 2019
తెలంగాణలోని ప్రతీ ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బతుకమ్మ పండుగని సెప్టెంబర్ 28 నుంచీ అక్టోబర్ 6 వరకూ 9 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటున్నారు. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ.. రెండో రోజు అటుకుల బతుకమ్మ.. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ.. నాలుగో రోజు నాను బియ్యం బతుకమ్మ.. ఐదో రోజు అట్ల బతుకమ్మ ... ఆరో రోజు అలిగిన బతుకమ్మ.. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ.. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటూ వివిధ పేర్లతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజిస్తారు. యువతులు, ముత్తైదువులు ఆడుతూ పాడుతూ కొత్త బట్టలు ధరించి బతుకమ్మను పేర్చి ఒక్క చోటుకు చేరి ఆడుతుంటే కళ్లార్పకుండా చూడాల్సిందే. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ వేడుకలు మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు కొనసాగుతాయి.
అంటే దసరా నవరాత్రుల సమయంలోనే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 28న శనివారం... వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.తెలంగాణతోపాటూ... ముంబై, బెంగళూరు, కర్నాటకలోనూ బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు కావాల్సిన సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చివరి రోజున అంటే అక్టోబర్ 6న ముగింపు వేడుకలును ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్బండ్వరకు ర్యాలీ చేసి జరపబోతున్నారు. ఇండియాతోపాటూ... మరో ఆరు దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరగబోతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, ఖతార్, బహ్రైన్, కువైట్,యూ.ఏ.ఈ దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కాకతీయుల కాలం నుంచే బతుకమ్మను జరుపుకుంటున్నట్లు ఆధారాలున్న ఈ పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉంది.ప్రకృతితో ముడిపడి, పల్లె ప్రజలకు బతుకునిచ్చే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగకు వాయినాల్లో బెల్లం, సజ్జలు, పప్పు ధాన్యాలు... కలిపి ప్రసాదంగా ఇస్తారు. అలా చిరుధాన్యాలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు.ఒక పళ్లెంలో గుమ్మడి ఆకులు పరిచి... వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు.
ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి... అక్కడే తంగేడు.. బీర.. గన్నేరు.. నిత్యమల్లె.. బంతిపూలను ఒక్కో వరుసలో ఉంచుతారు.
అలా ప్రకృతి నుంచీ ప్రత్యక్షమయ్యే పూలమాత బతుకమ్మ. ఎనిమిది రోజులపాటూ అమ్మవారికి పూజలు చేసిన తర్వాత... తొమ్మిదో రోజు అష్టమినాడు జరిగే సద్దుల బతుకమ్మకు భారీ ఎత్తున పూజలు చేసి... పత్రితో సహా నిమజ్జనం చేస్తారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







