స్పేస్ నుంచి ట్వీట్ చేసిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 30, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొలిసారిగా ట్వీట్ చేశారు. ఐదు రోజుల క్రితం కజకిస్తాన్‌లోని బైకనూర్ నుంచి సోయుజ్ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి హజ్జా చేరుకున్న విషయం విదితమే. తాను చేసిన తొలి ట్వీట్‌లో, ఐఎస్‌ఎస్‌కి సంబంధించిన ఫొటోని షేర్ చేశారు. క్షణాల్లో ఈ ట్వీట్‌కి లైక్‌లు, రీ-ట్వీట్లు, కామెంట్లు పోటెత్తాయి. యూఏఈ నుంచి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తిగా హజ్జా అల్ మన్సౌరి ఇప్పటికే రికార్డు సృష్టించిన విషయం విదితమే. అక్కడ ఆయన తన ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. త్వరలో ఆయన తిరిగి భూమిని చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







