ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్:ఏ.పి
- September 30, 2019
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియమాక పత్రాలు అందజేశారు సీఎం జగన్. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా పని చేయాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు సీఎం జగన్. గ్రామ సచివాలయ వ్యవస్థను విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని అన్నారు జగన్.
ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చామన్న ముఖ్యమంత్రి… ఉద్యోగాల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు అని చెప్పారు. ఇకపై ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని.. అదే నెల చివరి కల్లా నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప.. వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







