యూఏఈ వెళ్ళకుండానే 12 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్
- October 04, 2019
యూఏఈ:ఇప్పటిదాకా ఎప్పుడూ యూఏఈ వెళ్ళని ఓ వ్యక్తి, అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన బిగ్ టికెట్ రఫాలె డ్రాలో 12 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. కేరళకు చెందిన 24 ఏళ్ళ మొహమ్మద్ ఫయాజ్, ఇండియన్ ఫైనాన్షియల్ సిటీ ముంబైలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తన స్నేహితుడి సూచనతో టిక్కెట్లను కొనడం ప్రారంభించాననీ, ఈ క్రమంలోనే తనకు ఈ బహుమతి లభించిందనీ చెప్పారాయన. అనారోగ్య కారణాలతో తన తండ్రి, తన తల్లి కొంత కాలం క్రితం ప్రాణాలు కోల్పోయారనీ, తన తండ్రి సౌదీ అరేబియాలో పనిచేశారనీ చెప్పారు మొహమ్మద్ ఫయాజ్. గెలిచిన సొమ్ముతో తన ఇంటిని నిర్మించుకుంటాననీ, అలాగే కొంత ఛారిటీ వర్క్ కూడా చేస్తాననీ అంటున్నారీ విజేత.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







