పోలీసులపై దాడి కేసులో 7 గురు యువకులకు జైలు

- January 10, 2016 , by Maagulf
పోలీసులపై దాడి కేసులో 7 గురు యువకులకు జైలు

ఏడుగురు యువకులకు పోలీసులపై దాడి చేసిన కేసులో జైలు శిక్ష పడింది. పోలీసులపై దాడి, ఆస్తుల ధ్వంసం అభియోగాలు నిరూపితం కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు షార్జా క్రిమినల్‌ కోర్ట్‌ పేర్కొంది. ఏడుగురూ బాల నేరస్తులు కావడం గమనార్హం. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో ఈ దాడికి పాల్పడ్డారు ఏడుగురు నిందితులు. ఈ దాడిలో 'సెంటర్‌ ఫర్‌ బాయ్స్‌ ఇన్‌ షార్జా' ధ్వంసమైంది. దాడికి పాల్పడినవారిలో ఆరుగురు ఎమిరేటీస్‌ మరియు ఒకరు ఒకోమోరోస్‌. దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. జూన్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డా సాహసోపేతంగా పోలీసులు, నిందితుల్ని అరెస్ట్‌ చేయగలిగారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com