ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు 60మందికి పైగా మృతి...
- October 05, 2019
బాగ్దాద్: ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్ర హింసకు దారితీస్తున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 60 మందికి పైగా మృతిచెందారు. మరో 2500మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సమస్య, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు మొఖ్తదా అల్ సదర్ నేతృత్వంలో తిరుగుబాటు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు.ప్రధానమంత్రి అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదిల్ అబ్దెల్ మహ్దీ ఇంతకుముందు నిరసనకారుల "చట్టబద్ధమైన డిమాండ్లు" విన్నారని, అయితే ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
నసీరియాహ్, దివానియాహ్, బస్రా, బాగ్దాద్ నగరాల్లో అల్లర్లు హెచ్చుమీరాయి. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజా ప్రతినిధులు అన్ని రకాల సమావేశాలను బహిష్కరిస్తారని ప్రకటించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







