విజయ్ 'విజిల్' ఫస్ట్ లుక్
- October 07, 2019
తెలుగు లో ఇప్పుడు ఇతర భాష నటీ, నటులు తమ సత్తా చాటుతున్నారు. మాలీవుడ్ బ్యూటీలు తెలుగు లో మంచి హిట్స్ సాధించి తమిళంలో కూడా తమ క్రేజ్ పెంచుకుంటున్నారు. ఇక తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్, అజిత్, విజయ్, సూర్య లాంటి హీరోలు తెలుగు లో మంచి క్రేజ్ సంపాదించడమే కాదు ఇక్కడ కూడా వారిని అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమాలకు అక్కడే కాదు ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. అయితే విజయ్ నటించిన సినిమాలు ఈ మద్య రిలీజ్ కన్నా ముందు కాంట్రవర్సీలే ఎక్కువగా వస్తున్నాయి. ఇక కాంట్రవర్సీ వచ్చిన సినామాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.
గతంలో విజయ్ నటించిన 'మెర్సిల్' తెలుగు లో అదిరింది మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో డాక్టర్స్, జీఎస్టీపై వ్యతిరేకత ఉందని పెద్ద గొడవ జరిగింది. తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'సర్కార్' మూవీపై కూడా ఎన్నో వివాదాలు చెలరేగాయి. అప్పట్లో ఎన్నికల ముందు ఇచ్చే బహుమతుల గురించి ఈ మూవీలో విమర్శించారని ఒక వర్గం రాజకీయ నాయకులు గొడవ చేశారు. మొత్తానికి ఈ రెండు మూవీస్ తెలుగు కూడా మంచి సక్సెస్ సాధించాయి.
తాజాగా అట్లీ,విజయ్ కాంబినేషన్ లో 'బిగిల్' అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. తెలుగులో అనువదిస్తున్న ఈ సినిమాకు 'విజిల్' టైటిల్ ఖరారు చేసారు. విజయదశమి సందర్బంగా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్, యోగిబాబు, డేనియల్ బాలాజీ ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి తెలుగులో విజల్ ఏమేరకు వినిపిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!