కీరా దోసకాయ పచ్చడి..
- May 16, 2015

కావలసిన పదార్ధాలు:
- కీరా దోసకాయ - 1/2 ముక్క
- ఆవాలు - 1 టేబుల్ స్పూను
- నువ్వులు - 1 టేబుల్ స్పూను
- పసుపు - చిటికెడు
- ఎండు మిర్చి - 1
- పచ్చి మిర్చి - 1
- చింతపండు రసం - 1 టీ స్పూను
- ఉప్పు – తగినంత
- నూనె - 1 టేబుల్ స్పూను
- పోపు దినుసులు - 1 టేబుల్ స్పూను
- కరివేపాకు - కొద్దిగా
చేయు విధానం:
- ముందుగా కీరా ని పెచ్చు తీయకుండా చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి.
- పైన చెప్పిన పదార్ధాలన్నీ మిక్సీ లో వేసి కొంచెం నీరు పోసుకొని పేస్టు లా చేసుకోవాలి.
- ఈ పేస్టు ను కీరా ముక్కలలో కలపాలి.
- ఒక మూకుడులో నూనె వేసి, కాగాక పోపు దినుసులు, కరివేపాకు వేసి ఈ పోపు ను కీర ముక్కలపై వేసి కలపాలి.
- అంతే ఆవ ఘాటుతో కర కర లాడుతూ కీరా పచ్చడి రెడీ!!
- దీనిని అన్నంతో తింటే బాగుంటుంది.
ఇంకెందుకు ఆలస్యం..రేపే మీ వారికి చేసి పెట్టండి. :)
---- విశ్వనాధ కామేశ్వరి, వైజాగ్.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







