కుందేలు ఉపాయం..
- May 16, 2015
ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది. దాని మధ్యలో చిన్న దీవి ఉండేది. ఆ దీవిలో రకరకాల పండ్ల చెట్లు ఉండేవి. ఆ పండ్లను తినాలని చాలా జంతువులకు ఆశగా ఉందేదిగానీ అక్కడకు వెళ్ళడానికి సాహసించేవికాదు. ఎందుకంటే ఆ సరస్సు నిండా మొసళ్ళు ఉండేవి. ఒకరోజు దాహం తీర్చుకోడానికి సరస్సు దగ్గరకు వచ్చిన కుందేలుకు దీవిలోని పండ్లను చూసి నోరూరింది. ఎలాగైనాసరే ఒక్కసారి అక్కడకు వెళ్లి కడుపునిండా పండ్లు తినాలనే కోరిక కలిగింది. ఆ రాత్రంతా బాగా ఆలోచిస్తే దానికో ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయాన్నే సరస్సు దగ్గరకు వెళ్లి మొసళ్ళను ఒడ్డుకు రమ్మంటూ కేకలు పెట్టింది. 'మమ్మల్ని బయటకు రమ్మనే ధైర్యం ఎవరికుందబ్బా' అనుకుంటూ అవి బయటకు వచ్చాయి. 'మీకో శుభవార్త చెబుదామని పరుగెత్తుకుంటూ ఇలా వచ్చాను. మన మృగరాజుగారు అడవిలోని జంతువులన్నింటికీ విందు భోజనం ఎర్పాటు చేసి బహుమతులు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అందుకని మిమ్మల్ని లెక్కపెట్టే పని నాకు అప్పగించారు. మీరు నన్ను ఏమీ చేయకుండా ఉంటే లెక్కపెట్టి రాజుగారికి విన్నవిస్తాను' అంది ఎంతో వినయంగా. 'మమ్మల్ని నువ్వెలా లెక్కపెడతావ్' అని అనుమానంగా అడిగిందో మొసలి. 'మీరందరూ ఒక వరుసగా ఉంటే లెక్కపెట్టేస్తాను' అంది కుందేలు. అది చెప్పినట్టుగానే చేశాయి మొసళ్ళు. వాటి వరుస సరస్సు ఒడ్డు నుంచి దీవి వరకూ ఉంది. కుందేలు వాటి మీద నుంచి దీవికి చేరుకొని చక్కగా కడుపు నిండా పండ్లూ దుంపలూ తిని వచ్చింది. 'ఎప్పుడో వెళ్లినదానివి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావ్?' అంటూ గట్టిగా అరిచిందో మొసలి. మీరెందరు ఉన్నారో లెక్క ఖచ్చితంగా తేలక అవస్థ పడుతున్నాను. 'ఒక్కసారి మళ్ళీ నిలబడితే ఈసారి సరిగ్గా లెక్కపెడతాను' అంది కుందేలు. దాని మాట ప్రకారం మళ్ళీ వరుసగా నిలబడ్డాయి మొసళ్ళు. తన ఉపాయంతో కడుపు నిండుగా పండ్లూ దుంపలూ తిన్న కుందేలు వాటి మీద నుంచి చెంగు చెంగున దూకుతూ సరస్సు నుంచి బయటపడింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







