వలసదారుల హైరింగ్‌ ఇకపై మరింత సులభతరం

- October 12, 2019 , by Maagulf
వలసదారుల హైరింగ్‌ ఇకపై మరింత సులభతరం

మస్కట్‌: ఫారిన్‌ ఎంప్లాయీస్‌ని హైర్‌ చేసుకోవడం మరింత సులభతరంగా మారిందని గ్లోబల్‌ కాంపిటీటివ్‌నెస్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. 2018తో పోల్చితే, 2019 విదేశీ ఎంప్లాయీస్‌ నియామకం సులభమయ్యిందని ఈ నివేదిక చెబుతోంది. తాజా రిపోర్ట్‌ ప్రకారం ఒమన్‌ 7 పాయింట్లకుగాను 4 పాయింట్లు సంపాదించింది. 'ఈజ్‌ ఆఫ్‌ హైరింగ్‌ ఫారిన్‌ లేబర్‌' కేటగిరీలో ఒమన్‌ మెరుగైన ఫలితాల్ని సాధిస్తోంది. మొత్తంగా 48.9 స్కోర్‌ సాధించింది ఒమన్‌. ఈ లిస్ట్‌లో ఒమన్‌కి 83వ స్థానం దక్కింది. 2018లో ఒమన్‌కి 3.8 స్కోర్‌ దక్కగా, క్యుములేటివ్‌ స్కోర్‌ 47.7గా వుంది. ఆ ఏడాది 90వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ ప్లేస్‌ అల్బేనియాకి దక్కింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com