ఉమ్మడి గల్ఫ్ సైనిక చర్యలు పటిష్టం

- January 11, 2016 , by Maagulf
ఉమ్మడి గల్ఫ్ సైనిక చర్యలు పటిష్టం

అరబ్ దేశాలు లక్ష్యంగా సవాళ్ళు , పలు ప్రాంతీయ బెదరింపులు జరుగుతున్న నేపద్యంలో ఉమ్మడి గల్ఫ్ సైనిక చర్యలు పటిష్టం చేసేందుకు సామూహిక కృషి చేయాలని బహెరిన్ రక్షణ శాఖ దళ  కంమంఢర్ ఇన్ చీఫ్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పిలుపును ఇచ్చారు. ఆయన రాయల్ కమాండ్  స్టాఫ్ అండ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీ నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొని ప్రస్తుత పరిణామాలను గూర్చి వివరించారు. సైనిక శిక్షణ పద్దతులు, చర్య, ప్రతి చర్య , స్పందన , యుద్ధ  ముందస్తు దశలను గ్రహించే అంశాల గూర్చి ఆయన మాట్లాడారు.  తాజా పరిస్థితులకు అనుగుణంగా నాయకులు , అధికారులు సంసిద్ధంగా ఉండాలని, సైనిక రక్షణలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ పోషించే పాత్ర ఎంతో విలువ కలదని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com