ఎక్కడబడితే అక్కడ వ్యర్ధాలను వదిలేస్తే 10 వేల దినార్ల వరకు జరిమానా
- January 11, 2016
యాదృచ్చికంగా నచ్చిన చోట్లలో వదిలించుకునే యత్నం చేస్తే, అటువంటివారిని గుర్తించి వారికి భారీ జరిమానా విధించడం జరుగుతుందని ఉంమ్ అల్ కువైన్ ప్రజా పనుల శాఖ హెచ్చరించింది. ఈ జరిమానా 1000 దీనార్ల నుంచి 10 వేల దినార్ల వరకు ఈ మొత్తం వసూలు చేయబడుతుంది. ఇదే విషయాన్ని ప్రత్యేక నివేదికలో సైతం పొందుపరిచారు. ఈ జరిమానాలపై ప్రజలకు అవగాహన కల్గించేందుకు వివిధ కూడళ్ళ వద్ద అరబిక్ , ఇంగ్లీష్ , ఉర్దూ భాషలలో ప్రచార బొర్దులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ డంపింగ్ వ్యర్ధాలను పట్టణ వేలుపుల నుంచి తరలించేలా, ప్రజా పనుల శాఖ ఈ ఒప్పందాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. పలు చోట్ల ఉన్న దుకాణాలలో షాప్ కీపర్లు పలు సందర్భాలలో తమ తమ దుకాణంలోని వ్యర్ధాలను ప్రజా పనుల శాఖ కేటాయించిన ప్రదేశాల్లో కాక , తమకునచ్చిన చోట్ల విసిరేయడంతో సమస్య తీవ్రత పెరిగందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







