దోపిడీకి గురైన మరో ఇండియన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌

దోపిడీకి గురైన మరో ఇండియన్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌

కువైట్‌: ఓ పఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ హోమ్‌ డెలివరీ సర్వీస్‌ విబాగంలో పనిచేస్తోన్న భారత వలసదారుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వ్యక్తులు తనపై దోపిడీకి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్‌ సులైబియాలోని మెయిన్‌ ల్యాండ్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. 80 దినార్లు బాధితుడి నుంచి నిందితులు దోచుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. వినియోగదారుడికి డెలివరీ చేయాల్సిన ఫుడ్‌ని సైతం బాధితుడి నుంచి నిందితులు దోచుకున్నారని అధికారులు వివరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

Back to Top