జనవరి 1 వరకు 'నో' టోల్‌ ఛార్జెస్‌

- October 14, 2019 , by Maagulf
జనవరి 1 వరకు 'నో' టోల్‌ ఛార్జెస్‌

అబుదాబీలో టోల్‌ గేట్ల ఇంప్లిమెంటేషన్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అక్టోబర్‌ 15 నుంచి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అబుదాబీ (డిఓటి), టోల్‌ గేట్లను ఆపరేట్‌ చేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే, జనవరి 1, 2020 వరకు ఎలాంటి టోల్‌ ఫీజులు వసూలు చేయడంలేదనీ, అదే సమయంలో కొన్ని ఫీ ఎగ్జంప్షన్స్‌ అలాగే మంథ్లీ క్యాప్స్‌ని అనౌన్స్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామనీ అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెల్లడించింది. మొత్తం నాలుగు టోల్‌ గేట్లలో ఒకటి సమస్యాత్మకంగా మారడం, ఇతరత్రా సమస్యలతో టోల్‌ ఫీజు వసూలుని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.టోల్‌ గేట్‌ సిస్టమ్‌ అక్టోబర్‌ 15న ప్రారంభమవుతుందనీ, అయితే జనవరి 1 వరకు ఫ్రీ ఆఫ్‌ ఛార్జ్‌ బేసిస్‌లో టోల్‌ గేట్లు పనిచేస్తాయనీ అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com