తెలంగాణ ప్రజా సమితి ఖతర్ (TPS)బతుకమ్మ,దసరా సంబరాలు
- October 15, 2019
దోహా:తెలంగాణ ప్రజా సమితి ఖతార్ ఐసిసి లో బతుకమ్మ & దసరా పండుగ వేడుకలను నిర్వహించింది. ' బతుకమ్మ ప్రత్యేక, వైభవ ఉత్సవం తల్లి ప్రకృతికి కృతజ్ఞతలు తేలీపారు. పెద్ద సంఖ్యలో మహిళలు గానం మరియు నృత్యం చేసే ఈ ఆచారంలో పాల్గొన్నారు. వందలాది ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సహంగ వచ్చారు.
తెలంగాణకు చెందిన మహిళలు అశోకా హాల్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసీసీ) లో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయ బద్దంగా మహిళలు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు మరియు అద్భుతమైన పుష్ప ఏర్పాట్లతో రంగురంగుల సిల్క్ మరియు పట్టు చీరలు ధరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాదు నుండి జయకేతనం ఎగురవేసిన సుప్రసిద్ధ కళాకారులు, తెలంగాణ ప్రముఖ జానపద గాయకులు మిట్టపల్లి సురేందర్, వొల్లెల వాణి . ప్రేక్షకుల తమ పాటలతొ సమ్మోహితులన్ చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ తెలంగాణ ప్రజా సమితి యొక్క (TPS) మహిళలు మరియు పిల్లలు చెసిన డాన్స్ లు జనాన్ని ఉరృతలు ఊగించాయ్.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిసి అధ్యక్షుడు శ్రీ మణి కంర్ణన్, ఐసిసి ఉపాధ్యక్షుడు వినోద్ నాయర్,నయన వాగ్, ICBFకు చెందిన రజని మూర్తి, ICC యొక్క భూమేశ్వర్, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో TPS ఉపాధ్యక్షునిగా గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ, హజారైన ప్రముఖులందరికీ, స్పాన్సర్స్ కు, ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపి, భవిష్యత్తులో కూడా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఛానల్ 5 మీడియా భాగస్వామిగా ఉంది.
తెలంగాణ ప్రజా సమితి ఖతర్ అధ్యక్షుడు తిరుపతి వచ్చిన ప్రముఖ అతిథులందరినీ సత్కరించారు.
ఉత్తమ బతుకమ్మ ఏర్పాట్లకు ఆర్గనైజర్లు అవార్డులను సమర్పించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం బతుకమ్మను నీటి ట్యాంకుల్లో నిమజ్జనం చేసి, వచ్చే ఏడాది తిరిగి రావాలని బతుకమ్మలను ప్రార్థించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..