గోల్డ్ తరలింపు: ఇండియాలోని యూఏఈ ఎంబసీ హెచ్చరిక
- October 15, 2019
ఢిల్లీ:ఇండియన్ సబ్ కాంటినెంట్‌లోని యూఏఈ ఎంబసీ, ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల్ని ఉద్దేశించి ఓ హెచ్చరికను ట్విట్టర్ ద్వారా జారీ చేసింది. ఈ హెచ్చరిక సారాంశంలోకి వెళితే, ఇండియాకి వెళ్ళాలనుకుంటున్న యూఏఈ జాతీయులు, తమ గోల్డ్ జ్యుయెలరీని సంబంధిత అథారిటీస్ వద్ద డిస్‌క్లోజ్ చేయాలని పేర్కొంది. ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్‌లో సంబంధిత అథారిటీస్‌కి తమ జ్యుయెలరీకి సంబంధించిన వివరాలు అందజేయడం ద్వారా చట్టపరమైన సమస్యలుండవని ఆ హెచ్చరికలో పేర్కొంది. కాగా, అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ - కస్టమ్స్ గైడ్ ప్రకారం, విదేశాల్లో స్థిరపడి ఇండియాకి తిరిగి వెళ్ళే భారత వలసదారులు, మహిళలైతే ఒక్కొక్కరూ తమ వెంట 1,00,000 విలువ చేసే బంగారాన్ని, పురుషులైతే 50,000 విలువ గల బంగారాన్ని తీసుకు వెళ్ళవచ్చు. కాగా, కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం చెల్లించి ఒక్కో ప్రయాణీకుడు కిలో బంగారం వరకూ తీసుకెళ్ళొచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..