'గోఎయిర్' వారి కొత్త సర్వీసులు
- January 11, 2016
ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ చిన్న నగరాలు, పట్టణాలకు కూడా తమ సేవల్ని విస్తరిస్తోంది. దీనికోసం కొత్తగా 12 డెయిలీ సర్వీసుల్ని నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థ వెల్లడించింది. రానున్న వేసవి సీజన్కి వీలుగా మార్చి 27 నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పింది. ఈ విషయమై గోఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాల్ఫ్గేంగ్ ప్రోక్ స్కావియర్ మాట్లాడారు. కొత్తగా మరో నాలుగు రూట్లలో తమ సర్వీసులు మొదలవుతాయని చెప్పారు. పోర్ట్ బ్లెయర్ నుంచి బెంగళూరుకు, లెహ్ నుంచి ముంబయికి తమ విమానాల్ని నడపనున్నామన్నారు. ముంబయిదిల్లీబెంగళూరులకు మంచి సమయాల్లో విమానాలన్ని నడపడంతోపాటు, చిన్న పట్టణాలకు సేవల్ని విస్తరిస్తామన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







