హెల్త్‌ కేర్‌, ఎడ్యుకేషన్‌పై యుఏఈ ఫోకస్‌

- January 11, 2016 , by Maagulf
హెల్త్‌ కేర్‌, ఎడ్యుకేషన్‌పై యుఏఈ ఫోకస్‌

హెల్త్‌ కేర్‌ రంగంపైనా, ఎడ్యుకేషన్‌ రంగంపైనా ఇకపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని యూఏఈ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఎమిరేటిస్‌తోపాటు ఇక్కడ నివసిస్తున్నవారికి సంబంధించి హెల్త్‌కేర్‌, ఎడ్యుకేషన్‌ అతి ముఖ్యమైన అంశాలని యూఏఈ క్యాబినెట్‌ అభిప్రాయపడింది. దుబాయ్‌ రూలర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ది యుఏఈ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ నాయకత్వంలో జరిగిన ఈ మీటింగ్‌లో, ఆసుపత్రుల్లో వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించడం, స్కూల్‌ టీచర్లకు నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పబ్లిక్‌ హాస్పిటల్స్‌లో వెయిటింగ్‌ సమయంతోపాటు, సర్జరీ సక్సెస్‌ రేట్‌, ఆసుపత్రిలో వుండే సమయం, పేషెంట్‌ సంతృప్తి వంటి అంశాలతో రికార్డ్స్‌ని రూపొందించి, వాటి ద్వారా భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనకు వీలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్‌ కేర్‌, ఎడ్యుకేషన్‌ విభాగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని షేక్‌ మహమ్మద్‌ చెప్పారు. అందరికీ అతి ముఖ్యమైన ఈ రెండు అంశాల్లో యూఏఈ గణనీయమైన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. యూఏఈలో ఎనర్జీ మరియు వాతావరణ మార్పుల గురించీ చర్చించింది. అలాగే విద్యుత్‌ ఆదాపైనా చర్చించి, పొదుపుగా విద్యుత్‌ని ఉపయోగించే బల్బుల వినియోగంపై అవగాహన కల్పించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఎమిరేట్స్‌ జనరల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ రిస్ట్రక్చరింగ్‌ని క్యాబినెట్‌ ఆమోదించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com